అడ్డంగా బుక్కైన తెలంగాణ మంత్రులు… వివాదాస్పదంగా మారిన వ్యవహారం

by Shyam |   ( Updated:2021-08-13 06:12:38.0  )
అడ్డంగా బుక్కైన తెలంగాణ మంత్రులు… వివాదాస్పదంగా మారిన వ్యవహారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రుల వ్యవహారం వివాదాలకు తావిస్తోంది. గతంలో నిషేదిత గుట్కా తీసుకుంటూ కెమెరాకు చిక్కి బుక్కైన మంత్రులు.. తాజాగా హుజురాబాద్​లో నిర్వహించిన ర్యాలీ విమర్శలకెక్కింది. ప్రధానంగా నెటిజన్లు ఈ ఫొటోలతో అడుకుంటున్నారు. హుజురాబాద్​లో గతంలో మాస్కులు లేకుండా తిరిగిన వారికి రూ. 1000 జరిమానా విధించిన పోలీసులు.. మంత్రులను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్​ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హుజురాబాద్​లో మంత్రులు విచ్చలవిడిగా.. కనీసం మాస్కులు లేకుండా తీసిన ర్యాలీ ఫొటోలను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తున్నారు.

కొంతమంది తమకు వేసిన ఫైన్​లను వివరిస్తూ మంత్రులకు కూడా జరిమానా వేయాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. దీంతో మంత్రులు మళ్లీ వివాదంలో చిక్కినట్లు అయింది. మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​తో పాటు పలువురు టీఆర్​ఎస్​ నేతల ఫోటోలను నెట్టింటా వైరల్​ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed