- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. చిక్కుల్లో మంత్రి ఎర్రబెల్లి.. మరోసారి షాక్
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా కమలాపూర్ ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక అందజేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ వరంగల్ సీపీ తరుణ్‌జోషిని ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. కమలాపూర్ ఎంపీడీవో సంఘటనపై కాంగ్రెస్ ఏఐసీసీ నాయకుడు బక్క జడ్సన్ కొద్దిరోజుల క్రితం జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఎంపీడీవోపై అసభ్యకరరీతిలో అవమానించేలా మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేశారని, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నా.. ఏం మాట్లాడలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 27న ఫిర్యాదును విచారణకు స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పష్టం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, చల్లా ధర్మారెడ్డిలపై కేసు నమోదైంది. తాజాగా ఈ సంఘటనపై విచారణ చేయాలని వరంగల్ సీపీ తరుణ్ జోషికి ఆదేశాలు అందాయి.