గాంధీజీ సిద్ధాంతాల‌ను ఆచ‌రించాలి : అనిల్ దత్త మిత్ర

by Ramesh Goud |
గాంధీజీ సిద్ధాంతాల‌ను ఆచ‌రించాలి : అనిల్ దత్త మిత్ర
X

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ప్రపంచ వ్యాప్తంగా మహాత్మాగాంధీ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అందరూ కృషి చేయాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపిన ఆదర్శ పురుషుడు మహాత్మాగాంధీ అని న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అనిల్ దత్త మిత్ర పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హ‌న్మకొండ‌ హంటర్ రోడ్లోని మాజీ మంత్రి తక్కలపల్లి పురుషోత్తమ రావు నివాసంలో తెలంగాణ‌ జన వేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్ జూమ్ సదస్సు నిర్వహించారు. ఈ సద‌స్సుకు తెలంగాణ జన వేదిక వ్యవస్థాపక కన్వీనర్ రాము నేతృత్వం వహించారు. సమకాలీన సందర్భంలో గాంధీజీ ఆలోచనలు అనే అంశంపై న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అనిల్ దత్త మిత్ర ముఖ్య వ‌క్తగా కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో గాంధీజీ సూచించిన శాంతి, అహింస అంశాల చుట్టూతే ఉన్నాయ‌ని స్పష్టం చేశారు. అన్ని మతాల సారాన్ని గ్రహించి గాంధీ మంచిని ప్రచారం చేశార‌ని అన్నారు. ఆర్థిక అభివృద్ధికి గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలన్నింటికీ, అన్ని సమస్యలకు గాంధీజీ సూచించిన మార్గంలో పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ జన వేదిక వ్యవస్థాపక కన్వీనర్ మాట్లాడుతూ.. జన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సమస్యలపై సదస్సులను ప్రజల్లో చైతన్యం నింపుతోంద‌ని అన్నారు. ఈ సదస్సులో డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు, డాక్టర్ కొట్టే భాస్కర్, జి రామ్ రెడ్డి, ప్రత్యూష, బజార్ రంగారావు, శ్యామ్, విష్ణు చరణ్ చౌదరి, గట్ల సుధాకర్ నారాయణ యాదవ్, పి. ఉమా మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed