- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొక్కలు నాటడంలో తెలంగాణ నెంబర్ వన్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అడవుల పునరుద్ధరణ , సంరక్షణకు గడిచిన ఆరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న “తెలంగాణకు హరితహారం” కార్యక్రమం సాధిస్తున్న ఘనతను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. మొక్కలు నాటడంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు. హరిత యజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ సీఎం అభినందించారు.
పుట్టినరోజు మొక్కను నాటాలి: ఇంద్రకరణ్ రెడ్డి
అటు మానవ మనుగడ సాఫీగా సాగాలంటే అడవులు, ప్రకృతిని సంరక్షించుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అడవుల పునరుజ్జీవనకు ఇదే సరైన సమయమని, లేకపోతే భవిష్యత్తులో గాలి, నీరు దొరకని పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సంవృద్ధిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ తమ పుట్టిన రోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికి స్పూర్తిదాయకంగా నిలవాలని ఆయన సూచించారు.