ఏప్రిల్​ చివరివారంలో ఇంటర్ పరీక్షలు

by Shyam |
intermediate exams
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్​ పరీక్షలను ఏప్రిల్ చివరివారంలో నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. వచ్చే మార్చి 23 నుంచి ఏప్రిల్​14వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని సెప్టెంబర్​లో విడుదల చేసిన విద్యా క్యాలెండర్లో బోర్డు వెల్లడించింది. కాగా ఆ నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

ఇటీవల ఇంటర్​ సెకండియర్​ విద్యార్థులకు ఫస్టియర్​ పరీక్షలు నిర్వహించడం, జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యం కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. పరీక్షల కారణంగా తరగతులు జరగలేదు దీంతో సిలబస్‌పూర్తి కాలేదు అందువల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కాగా ఇంటర్​ పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్ ​చివరి వారం నుంచి మే మొదటివారం వరకు సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఇంటర్‌ పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులో వెల్లడిస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story