- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే ఫస్ట్.. కేసీఆర్ సర్కార్ కీలక స్టెప్.. వారికి గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా మహమ్మారి పల్లె నుంచి పట్టణం వరకూ ఎవరినీ వదలకుండా వ్యాప్తిచెందుతున్నది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాల్లో, గిరిజన ఆవాసాల్లో ఉన్న కొవిడ్ పేషెంట్స్‌కి మెడిసిన్స్ అందించేందుకు కష్టం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.
దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఈ ప్రయోగాన్ని తెలంగాణ ప్రభుత్వం చేయనుండటం విశేషం. అయితే, డ్రోన్‌లను ఉపయోగించి మందులు, వ్యాక్సిన్‌లను పంపిణీ చేసే ట్రయల్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రయోగం వికారాబాద్ పరిధిలో గురువారం, శుక్రవారం జరగనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ డ్రోన్స్ ద్వారా దాదాపు 9 నుంచి 10 కిలోమీటర్ల వరకూ మందులను పంపిణీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, వీటి ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో స్పీడ్‌గా వైద్యసామాగ్రిని అందించేందుకు సహాయపడుతుందని డ్రోన్ల నిర్వహణ కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్న స్కై ఎయిర్ మొబిలిటీ కంపెనీ కో-ఫౌండర్ స్వప్నిక్ జక్కంపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, డ్రోన్ల ద్వారా మందులను డెలివరీ చేసేందుకు బ్లూ డార్ట్ డెలివరీ పార్ట్‌నర్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.