కెమికల్ ఇంజినీర్‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్..

by Sumithra |
chemical-enjineer -case
X

దిశ, వెబ్‌డెస్క్ : కెమికల్ ఇంజినీర్‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్‌ ‌పై ఓ టీవీ షో వేదికగా ఇష్టానుసారంగా అసత్య కథనాలు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. వైద్యారోగ్య శాఖ ఫిర్యాదు ప్రకారం.. ఎపిడమిక్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

కరోనా థర్డ్ వేవ్‌పై కెమికల్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని భావించిన వైద్యారోగ్య శాఖ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి చర్యలకు ఉపక్రమించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, ఇకమీదట కరోనాపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఎవరైనా అసత్య కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story