- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాదైనా నిర్మాణం జరిగేనా.?
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఎలక్షన్ సమీపించగానే నేతలకు ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయి.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట హడావుడి చేస్తారు. ఆ తర్వాత షరా మామూలే.. మహానగరానికి మంచినీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లి మండలం కేశవాపూర్ కొండల నడుమ భారీ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2050 వరకు నగర జనాభాకు నీటి సమస్య తలెత్తకుండా 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలనుకున్నారు. కానీ, భూ సేకరణ సమస్యలతో ప్రాజెక్టును 10 టీఎంసీలకు కుదించారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల సమయంలో కేశవాపూర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించేందుకు టీఆర్ఎస్ సర్కారు సన్నాహాలు చేసింది. ఎన్నికలు ముగియడంతోనే ప్రాజెక్ట్ ను అటకెక్కించింది. ప్రాజెక్ట్ నిర్మాణంపై మూడేళ్లుగా ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు 2020, అక్టోబర్ 5న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో కేశవాపూర్ప్రాజెక్ట్ పురోగతిపై జలమండలి, పురపాలక శాఖ అధికారులతో సమీక్షించారు. రిజర్వాయర్ కు సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అనుమతులకు సంబంధించి మరింత వేగంగా ముందుకు సాగాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. త్వరలోనే కేశవాపూర్ రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేస్తామని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ కు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉందని, వీటికి సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలని, ఆ దిశగా జలమండలి అధికారులు పనిచేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. ప్రాజెక్ట్ శంకుస్థాపన ఎప్పుడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
మూడేళ్లుగా ఎదురు చూపులే..
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ జనాభా పెరుగుతుండడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లి మండలం, కేశవాపూర్కొండల నడుమ భారీ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2050 నాటికి నగరానికి నీటి సమస్య తలెత్తకూడదని 20 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్ట్ నిర్మించాలని ముం దుగా డిజైన్ చేశారు. ఇందుకోసం దాదాపుగా నాలుగు వేల ఎకరాల భూ సేకర ణ చేయాల్సి రావడం అధికారులకు సవాల్ గా మారింది. కేశవాపూర్ పరిసర ప్రాంతా ల్లోని రైతుల భూములు సేకరించాల్సి ఉండగా వారు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. దీంతో వెయ్యి ఎకరాల అటవీ శాఖ భూములతోపా టు 500 ఎకరాల ఇతర భూములపై ప్రభావం పడేలా రిజర్వాయర్ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు తగ్గించారు. అత్యధికంగా ఫారెస్ట్ భూములుండడంతో దాదాపు రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 1011.40 ఎకరాల ఫారెస్ట్ భూములను ఇచ్చేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రాజెక్ట్ కు 1490 ఎకరాలు అవసరం కాగా, మిగితా భూ సేకరణను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని కేటీఆర్ గ్రేటర్ ఎన్నికలకు ముందు సంబంధిత అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.
హైబ్రిడ్ యాన్యూటీ పద్ధతిలో..
ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యూటీ( పూర్తిగా ప్రైవేటు నిధులు) తో నిర్మించాలని యోచించింది. 2017 డిసెంబర్ లో టెండర్ దాఖలు నోటిఫికేషన్ జారీ చేయగా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తిరిగి 2018 జనవరిలో టెండర్ రీకాల్ చేయగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో మెగా కంపెనీ రూ.4,396.15 కోట్లకు తక్కువ కోట్‌చేసి టెండర్ దక్కించుకుంది. అయితే, భూ సర్వే, నష్ట పరిహారం, రిజర్వాయర్ కెపాసిటీ తగ్గించడం లాంటి సమస్యలతో నిర్మాణ పనులు ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చాయి. రైతులు తమకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సరిపోవడంలేదని సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లి మూడు నెలల క్రితం తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో రైతులు అడిగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకారం తెలియజేయడంతో ప్రాజెక్ట్ కు అడ్డంకులు తొలగిపోయినట్లయింది.