- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలోనూ 'డిజిలాకర్'
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిజి లాకర్’ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా వినియోగంలోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విద్యా సంస్థలు దీనికి అనుసంధానమయ్యేలా ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌ను మార్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీ బుక్, ఆధార్ కార్డు, విద్యా సంబంధ సర్టిఫికెట్లు తదితరాలకు సంబంధించి ఆయా విభాగాలు ఫిజికల్ డాక్యుమెంట్ల కోసం వత్తిడి చేయవద్దని, డిజిలాకర్‌లో ఉన్న సాఫ్ట్ కాపీలను ప్రామాణికంగా తీసుకోవచ్చని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నందువల్ల పౌరులకు ఆయా ప్రభుత్వ శాఖలు, విభాగాలు జారీ చేసే డిజిటిల్ కాపీలపై దృష్టి పెట్టాలని, అందుకు తగినట్లుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్ళుగా అమలుచేస్తున్న డిజిలాకర్ విధానం ద్వారా సుమారు 370కోట్ల డాక్యుమెంట్లు డిజిటల్ విధానంలో అందుబాటులోకి వచ్చాయని, సుమారు 150కు పైగా ప్రభుత్వ విభాగాలు, శాఖలు, అనుబంధ సంస్థలు డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో కూడా జారీ చేస్తున్నయని గుర్తుచేసిన జయేశ్ రంజన్ తెలంగాణలోనూ దీన్ని అధికారికంగా అమలుచేయాలన్న నిర్ణయం జరిగిందని నొక్కిచెప్పారు. ప్రభుత్వ విభాగాలు ఇకపైన పౌరులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వీకరించాల్సి వచ్చినా, తనిఖీ చేయాల్సి వచ్చినా డిజిటల్ రూపంలో ఉన్నవాటిని, ‘డిజి లాకర్’లో ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
డిజిలాకర్ ప్లాట్‌ఫామ్‌కు అనుగుణంగా డిజిటల్ సర్టిఫికెట్లను జారీ చేయడానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా జయేశ్ రంజన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి అదనంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ బుక్‌లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్యా సర్టిఫికెట్లు, పాన్ కార్డు, ఆదాయపు పన్ను రిటన్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సర్టిఫికెట్లు, కోర్టు సంబంధ డాక్యుమెంట్లు, ఇన్సూరెన్సు పత్రాలు.. ఇలా అనేక రకాల సాఫ్ట్ కాపీలను కూడా డిజిలాకర్ విధానంలో సమర్పించినట్లయితే ఆమోదించాలన్నారు.