- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఆర్సీ కోసం నిరసనలు: టీఈఏ
దిశ, తెలంగాణ బ్యూరో : పీఆర్సీ సాధన కోసం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21న మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఈఏ అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి మాట్లాడుతూ.. పీఆర్సీతో పాటు బకాయిలున్న రెండు డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పీఆర్సీ కమిషన్ గడువు కూడా ఈ నెలాఖరుతో తీరుతుందని, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా పీఆర్సీ ప్రకటించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఉద్యోగవర్గాలు పీఆర్సీ, డీఏ, ఐఆర్ కోసం ఎదురుచూస్తున్నారని, హుజూర్నగర్ ఉప ఎన్నికల తర్వాత పీఆర్సీ ప్రకటన వస్తుందని ఆశించామన్నారు. గతంలో సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారని, ఇప్పటికైనా పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలని సంపత్ కుమారస్వామి కోరారు.
టీఈఏ ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం
అలాగే, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పొట్టబత్తిని పురుషోత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సంపత్ కుమారస్వామి ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. డాక్టర్ పురుషోత్తం విద్యార్థి దశ నుంచి డాక్టర్స్ అసోసియేషన్లో ప్రైవేట్ వైద్య కాలేజీల్లో సదుపాయాల కోసం ఉద్యమించారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీల రద్దు కోసం కృషి చేశారని అభినందించారు. అనంతరం టీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పని చేస్తామన్నారు. ఈ నెల 21న ఇచ్చిన నిరసనలను విజయవంతం చేయాలని పురుషొత్తం పిలుపునిచ్చారు.