- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకుకు ‘సోను సూద్’ పేరు పెట్టుకున్న తెలంగాణ దంపతులు
దిశ, సినిమా: పాన్ ఇండియా యాక్టర్ సోనుసూద్ లాక్ డౌన్‌లో ప్రతి రోజూ హెడ్ లైన్స్‌లో నిలిచాడు. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రత్యేక బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వేలాది మంది వలస కూలీలను ఇంటికి చేరుకోవడానికి సహాయం చేసిన ఆయన.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్సలు చేయించారు. పేద పిల్లలకు మద్దతు ఇవ్వడంతో పాటు అవసరమున్న ప్రతి ఒక్కరికీ సాయం చేశారు. ఇందుకోసం ముంబైలోని తన ప్రాపర్టీస్ అమ్మేశాడని సమాచారం. అంత గొప్ప మనసున్న సోనుసూద్ సోషల్ సర్వీస్ ద్వారా స్ఫూర్తి పొందిన సిద్ధిపేట జిల్లా దుబ్బ తండా గ్రామస్తులు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పాండురంగ నవీన్, త్రివేణి దంపతులు తమ కుమారుడికి సోనుసూద్ పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సోనుకు తెలిపిన వారు.. కుమారుడి ‘అన్న ప్రాసన’ కార్యక్రమానికి ఆహ్వానించారు. లాక్ డౌన్ సమయంలో సోను మానవతా దృక్పథంలో చేసిన సహాయ కార్యక్రమాలు దేశమంతా ప్రశంసలు అందుకోగా..ఆ మహానుభావుడి పేరు తమ కుమారుడికి పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.