- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన సచివాలయ పనుల్లో కేసీఆర్.. అధికారులకు కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం పరిశీలించారు. రెండు సెల్లార్, ఒక గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. రెండో అంతస్తు శ్లాబ్ పనులు సగం వరకు పూర్తయ్యాయి. పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో, కాంట్రాక్టర్లతో చర్చించిన సీఎం కేసీఆర్ మిగిలిన అంతస్తుల పనులను అనుకున్న షెడ్యూలు ప్రకారం పూర్తయ్యేలా వేగం పెరగాలని స్పష్టం చేశారు. ’సచివాలయం నిర్మాణ కౌశలం మన పాలనా రీతులకు అద్దం పట్టే విధంగా, గౌరవం ఉట్టిపడేలా’ ఉండాలని నొక్కిచెప్పారు. డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేవో అనేక అంశాలపై కాంట్రాక్టర్లతో, ఇంజనీర్లతో చర్చించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది.
సచివాలయ నిర్మాణ పనులను అన్ని వైపులా కాలి నడకన కలియతిరిగి పరిశీలించిన సీఎం అక్కడే అధికారులతో, ఇంజనీర్లతో, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే సెక్రటేరియట్ అన్ని విభాగాల ప్రభుత్వ సిబ్బంది ప్రశాంతంగా విధులను నిర్వహించుకునే విధంగా వుంటుందన్నారు. సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామని, పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కల నుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా ఫ్లడ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలన్నారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు వెళ్ళిపోయేలా వుండాలన్నారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దర్వాజలు, కిటికీలు, ఫర్నీచర్, విద్యుత్, ప్లంబింగ్, టైల్స్ వంటి అన్ని రకాల విభాగాలకు అవసరమన ఇంటీరియర్ మెటీరియల్‌ను ముందస్తుగానే సమకూర్చుకోవాలన్నారు. జాప్యం లేకుండా కొనసాగించడానికి ఇది వీలవుతుందన్నారు.
సచివాలయం ప్రవేశద్వారాన్ని, బయటి గేటు నిర్మాణాలను, వాటికి అమర్చవలసిన గ్రిల్స్ తదితర అంశాలను కేసీఆర్ స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు. ప్రహరీ గోడలకు అమర్చాల్సిన లాంప్ పోస్టుల గురించి సూచనలిచ్చారు. సీఎం, సీఎస్ సహా మంత్రుల కార్యాలయాలు, ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు.
సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇతర రాష్ర్ట్రాల నుంచే కాక, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రముఖుల కోసం నిర్మాణమవుతున్న ‘వెయిటింగ్ హాల్’ నిర్మాణాల తీరును, సందర్శకులు కూర్చునే ప్రదేశాలను ఆయన పరిశీలించారు. పార్కింగ్ వ్యవస్థ గురించి ఆరాతీశారు. కార్లు, టూ వీలర్స్, బస్సులు తదితర వాహనాల పార్కింగు స్థలాలను పరిశీలించారు. హెలీపాడ్ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్‌కు వచ్చే వీఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను వివరించారు. బ్యాటరీతో నడిచే వాహనాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.