పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన శశాంక్ గోయల్.. అధికారులకు కీలక ఆదేశాలు

by Sridhar Babu |
Shashank Goyal
X

దిశ, కరీంనగర్ సిటీ: ఈ నెల 30న జరుగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. శనివారం కమలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఎస్సీ కాలనీ, అంబాల జెడ్పీహెచ్‌ఎస్, గూడూరు ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను శశాంక్ గోయల్, కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ సీపీ తరుణ్ జోషిలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజున రద్దీ లేకుండా, కొవిడ్ నిబంధనల ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని అన్నారు.

ఓటర్లు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు శశాంక్ గోయల్ సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ANM, ఒక ఆశా వర్కర్‌ను నియమించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, ఫర్నీచర్, విద్యుత్, వాష్‌రూమ్ సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికల అధికారులు, పోలీసులు సమావేశమై ఎన్నికల నిర్వాహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఇన్‌చార్జి డీఆర్‌ఓ వాసుచంద్ర, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సీహెచ్.రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed