రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

by Shyam |
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్‎డెస్క్ : ఈ నెల 10వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాల గురించి చర్చించి ఆమోదించే అవకాశం వుంది. యాసంగిలో అమలుచేయాల్సిన నిర్ణీత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ నెల 13వ తేదీన అసెంబ్లీ, 14వ తేదీన మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13వ తేదీన అసెంబ్లీ సమావేశం ఉదయం 11.30 గంటలకు జరగనుండగా.. 14వ తేదీన శాసన మండలి సమావేశం ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను 14న శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Next Story