- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు(శుక్రవారం) ప్రారంభం అయ్యాయి. ముందుగా తొమ్మిదిమంది మాజీ ఎమ్మెల్యేల మృతికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం ప్రకటించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలి, అజెండా, తదితర అంశాలపై చర్చించి, ఆ నిర్ణయాలను ఫైనల్ చేస్తారు. తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సమావేశాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు సమచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకంపై ప్రత్యేక చర్చకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతి కోరనున్నట్టు తెలుస్తోంది.