‘వీఆర్వోలను బ్లాక్​మెయిల్ ​చేస్తున్న తహసీల్దార్లు’

by Shyam |   ( Updated:2021-05-13 07:36:48.0  )
VRO
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం వీఆర్వోలకు స్పష్టమైన జాబ్​చార్ట్ పర్కటించకపోయినా కొందరు తహసీల్దార్లు తమను బ్లాక్​మెయిల్​చేస్తూ భూ సంబంధమైన విధులు, గతంలో చేపట్టిన పనులను చేయిస్తున్నారని తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు ఆరోపించారు. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ఆర్డినెన్స్​తీసుకొచ్చి, వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు. వారితో ఎలాంటి విధులు చేయించాలన్నా ఆదేశాలు ఇప్పటి వరకు రాకపోయిన తహసీల్దార్లు తమతో పనులు చేయిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనను జారీ చేశారు.

తహసీల్దార్లు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వేతనాలు నిలిపేస్తామని, ప్రతి రోజూ కార్యాలయానికి రావాలని, అటెండెన్స్​రిజిస్టర్​పెట్టడం, మెమోలు, చార్జ్​మెమోలు జారీ చేయడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. వీఆర్వోలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారి పేరుతోనే ఆర్డర్లు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు.ఈ పద్ధతులను తక్షణమే ఉపసంహరించుకోకపోతే సంబంధిత తహశీల్దార్లపై జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed