నల్లగొండ కోర్టుకు తీన్మార్ మల్లన్న

by Shyam |
Teenmar Mallanna
X

దిశ,డైనమిక్ బ్యూరో : క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నల్లగొండ కోర్టుకు వచ్చారు. మల్లన్న పై నమోదైన కేసులను పోలీసులు ఒక్కొక్కటిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో నమోదైన ఓ కేసులో ఆయనను బుధవారం నల్లగొండ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మను డబ్బులకోసం బెదిరించారన్న కేసులో 15 రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story