ఆ ఓట్లతోనే పల్లా గెలిచాడు: తీన్మార్ మల్లన్న

by Shyam |
ఆ ఓట్లతోనే పల్లా గెలిచాడు: తీన్మార్ మల్లన్న
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: 100 కోట్లు.. దొంగ నోట్లతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారని ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని, తన కోసం శాయశక్తులా ప్రయత్నించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అధికార పక్షానికి పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. తెలంగాణ నెలలో యుద్ధం మిగిలే ఉందన్నారు. విపక్ష పార్టీలు ఇకనైనా మేల్కొని తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో వంద శాతం ప్రజలే గెలిచారు. ప్రజలు డిస్టింక్షన్‌లో పాస్ చేయాలని చూసినా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నకిలీ పట్టాతో గద్దలా తన్నుకుపోయారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed