- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం తీసిన స్కిన్ టోన్..
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో రంగుకు ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వటం లేదు. అందుకేనెమో అందరూ రంగు రావాలని ఎన్నో ఫేస్క్రీమ్లు పెడుతూ రంగు కోసం ఆరాట పడుతుంటారు. ఇంకా ఎక్కువగా టీనేజర్లు రంగు గురించి బాధపడుతూ ఉంటారు. వారి ప్రవర్తనలోనూ మార్పులు కనిపిస్తుంటాయి. ఎప్పుడూ అద్దంలో చూసుకుంటూ అమ్మ నేను చాలా రంగు తక్కువగా ఉన్న కదా అంటూ డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. అయితే ఇలాంటి బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్తో బాధపడుతున్న 20 సంత్సరాల కంటే తక్కువగా ఉన్నవారిపై వారితల్లి దండ్రులు ఫోకస్ పెడితే టీనేజర్లు రంగు బాధ నుంచి బయట పడగలరు. కానీ తల్లి దండ్రుల నిర్లక్ష్యం వలన టీనేజర్లు తన చర్మం రంగు బాలేదని, ఫిజికల్ లుక్ సరిగా లేదని ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడరు.
అయితే, ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. చర్మం రంగు బాగాలేదని ఆత్మన్యూనతా భావానికి లోనైన పదకొండవ తరగతి చదువుతున్న విద్యార్థి 15 అంతస్తుల నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి తండ్రి ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచేస్తూ నోయిడాలో, తల్లి గురుగావ్లో ఉంటున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఈ టీనేజర్ రంగు తక్కువగా ఉన్నానని డిప్రెషన్కి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తెల్లవారు జామున 5 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.