- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, ఫీచర్స్ : నిజ జీవితంలో ఎదురయ్యే కొన్ని సందర్భాలు సినిమా క్లైమాక్స్‌ను గుర్తుకు తెస్తాయి. లేదంటే చిత్రాన్ని మలుపుతిప్పే కీలక సన్నివేశాలను తలపిస్తాయి. మనం లైఫ్‌లో అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే.. ఎవరిని ఎంచుకుంటావ్? అనే డైలాగ్స్‌ను చాలా మూవీస్‌లో వినే ఉంటాం. ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని.. లేదంటే ఫ్యామిలీ లేక ఫ్రెండ్స్.. కెరియర్ లేక పాషన్.. ఇలా రెండింటిలో ఏదో ఒకటిని ఎంచుకోమనే సన్నివేశాలు వెండితెరపై చాలానే చూశాం. కానీ రియల్ లైఫ్‌లో ఓ టీనేజర్‌కు ఇలాంటి సందర్భమే ఎదురైంది. ఇక్కడ తన జీవితం.. ఇకపై కనిపెంచిన అమ్మతోనా లేక ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లతోనా అనే సందిగ్ధంలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్‌లో పంచుకోగా.. మూవీకి మించిన రెస్పాన్స్ వచ్చింది. డిస్కషన్ వెబ్‌సైట్ ‘రెడిట్(reddit)లో ఈ స్టోరీని షేర్ చేయగా సూపర్ పాపులర్ స్టోరీస్‌లో ఒకటిగా నిలిచింది.
అమెరికాకు చెందిన 17 ఏళ్ల అబ్బాయి.. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. ఆ బాధ నుంచి తేరుకునే లోపే తల్లి ఆంటోనీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ టైమ్‌లో తండ్రి ఆలోచనల నుంచి, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలా చేసింది మాత్రం తన కుక్క పిల్ల ‘డాక్స్’ అని చెప్పాడు ఆ టీనేజర్. కానీ తన తల్లిని పెళ్లిచేసుకున్న ఆంటోనికి కుక్కలంటే ఎలర్జీ. దీంతో తను ఆరేళ్లుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను వదిలేయాలని అమ్మ ఆర్డర్ వేసిందని, తల్లి కావాలా? లేదా కుక్కపిల్లనా? ఎవరో ఒకరిని ఎంచుకోమన్నట్లుగానే వార్నింగ్ ఇచ్చిందని తెలిపాడు.
దీంతో ఆలోచనలోపడ్డ లిటిల్ బాయ్.. తాతయ్య(నాన్నకు తండ్రి) దగ్గరికి వెళ్లి, కుక్కను తను పెంచుకుంటే బాగుంటుందని, లేదంటే అమ్మ దానిని కచ్చితంగా వేరే వాళ్లకు ఇచ్చేస్తుందని బతిమాలాడు. కానీ ఆ పెట్ డాగ్‌ను బయటకు తీసుకెళ్లడం, టైమ్‌కు ఫీడ్ చేయడం వృద్ధుడైన తన వల్ల కాదేమోనని చెప్పిన గ్రాండ్ ఫాదర్.. బాయ్‌ను పెట్ డాగ్‌తో కలిసి తన దగ్గరే ఉండమని సలహా ఇచ్చాడు. ఇదే విషయాన్ని తల్లికి చెప్పగా.. ‘నువ్వు, నేను, ఆంటోనీ’ ఇప్పుడు ఒకే కుటుంబం, కాబట్టి తమతోనే ఉండిపోవాలి’ అని ఖరాకండిగా చెప్పినట్టు తెలిపాడు. కానీ ఆంటోనీతో తనకు సమస్యలున్నాయని.. తనకు న్యూ డాడీ అని చెప్పడం అసలు ఇష్టం లేదని ఆ టీనేజర్ తల్లితో చెప్పాడట. అంతేకాదు డాక్స్(కుక్క పిల్ల), గ్రాండ్ ఫాదర్ మాత్రమే తన కుటుంబమని, వారితోనే ఉండటం మంచిదని నిర్ణయించుకున్నానని క్లారిటీ ఇచ్చేసినట్టు తెలిపాడు.
ఇంతకీ ఆ కుక్క పిల్ల అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెప్పలేదు కదా! చనిపోయిన తండ్రి.. ఆ టీనేజ్ బాయ్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ కుక్కపిల్ల ప్రమాదంలో ఉంటే రక్షించి తీసుకొచ్చారు. అది పప్పీగా ఉన్నప్పుడే తమ ఇంటికి వచ్చిందని, పైగా నాన్న జ్ఞాపకాలు తనతో ముడిపడి ఉన్నాయనేది అబ్బాయి ఉద్దేశం. అలాంటిది ఎవరో తెలియని అనామకుడు(తల్లి కొత్త భర్త)కోసం తను ప్రాణంగా పెంచుకున్న కుక్క పిల్లను ఎందుకు కోల్పోవాలని అనిపించిందట. అయితే ఇప్పటికీ తన తల్లి ఒక చిలిపి కొడుకును కలిగి ఉన్నానని చెబుతుందని.. కానీ తను తనకు కావాల్సిన వ్యక్తితో ఉండిపోవడం తనకు సంతోషమే అంటున్నాడు ఈ క్రేజీ టీనేజర్.