ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు పంపించే ఫీచర్

by Disha Web Desk 17 |
ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు పంపించే ఫీచర్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ రాబోతుంది. ఇంటర్నెట్ లేకున్న కూడా ఫొటోలు, వీడియోలు వంటి ఫైల్స్‌లను షేర్ చేయడానికి అనుమతించే సదుపాయాన్ని కంపెనీ తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌ను మొదటగా జనవరిలో నివేదించారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు వచ్చింది. బ్లూటూత్‌, లొకేషన్‌ను ఎనెబుల్ చేసి వాట్సాప్‌కు డివైజ్‌లో ఉన్నటువంటి ఫైల్స్, ఫొటో గ్యాలరీలకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా నెట్ లేకుండానే మరో వాట్సాప్‌కు ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే మరో యూజర్ బ్లూటూత్‌కు కనెక్ట్ అయ్యేంత దూరంలో ఉండాలి. అలాగే, తన వాట్సాప్‌లో ఫైల్స్‌ను రిసీవ్ చేసుకోడానికి అనుమతించాల్సి ఉంటుంది. ఒకవేళ వద్దనుకుంటే రిక్వెస్ట్ క్యాన్సల్ చేస్తే చాలు.

ఈ ఫీచర్‌కు చివరి మెరుగులు దిద్దుతున్నారు. త్వరలో బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ 2.24.9.22 బిల్డ్ కోసం వాట్సాప్‌ బీటాలో ఇది గుర్తించబడింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా లీక్ అయింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేకుండానే ఈ ఫీచర్‌ ద్వారా ఒక వాట్సాప్ నుంచి మరో వాట్సాప్‌ అకౌంట్‌కు వేగంగా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ టాన్స్‌ఫర్ అవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed