- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరికొత్త రికార్డు నెలకొల్పిన WhatsApp Channels
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల చానెల్స్ అనే ఫీచర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చానెల్స్ సదుపాయం సరికొత్త రికార్డును నెలకొల్పింది. వాట్సాప్ చానెల్స్‌ను లాంచ్ చేసిన ఏడు వారాల్లోనే దాదాపు 500 మిలియన్ల నెలవారీ యూజర్లను చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో సెప్టెంబర్‌లో భారత్‌తో సహా 150 దేశాల్లో వాట్సాప్ చానెల్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలు, సెలబ్రిటీలు మొదలగువారు చానెల్స్‌ను క్రియేట్ చేసుకుని తమ కంటెంట్‌ను ఫాలోవర్స్‌కు నేరుగా అందించవచ్చు.
చానెల్ అడ్మిన్ మాత్రమే కంటెంట్‌ను షేర్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఫాలోవర్స్‌కు ఆ ఆప్షన్ ఉండదు. ఈ ఫీచర్ విడుదలైన అనతికాలంలోనే అత్యంత వేగంగా 500 మిలియన్ల యూజర్లకు చేరుకోవడం గొప్ప విషయం అని కంపెనీ పేర్కొంది. అలాగే చానెల్స్‌లో కొత్తగా అడ్మిన్‌లు తమ చానెల్ మెంబర్స్‌కు స్టిక్కర్‌లను షేర్ చేసే ఫీచర్‌ను అందించడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతానికి దీనిని WhatsApp బీటా వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నారు. త్వరలో మిగతా వారికి కూడా అందుబాటులోకి వస్తుంది.
- Tags