- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WhatsApp లో మరో అదిరిపోయే ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఒకేసారి ఎక్కువ మెసేజ్‌లను పంపడానికి బ్రాడ్‌కాస్ట్ మాదిరిగా ఉండేటటువంటి ఛానెల్‌లను తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్‌గా ఉంటుంది. ఛానల్‌లో అడ్మిన్ తమ ఫాలోవర్స్‌కు ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, మెసేజ్‌లను పంపించుకోవచ్చు. అప్‌డేట్స్ అనే ట్యాబ్‌ను కూడా కొత్తగా ఇచ్చారు. దీనిలో ఛానల్‌కు సంబంధించిన వివరాలతో పాటు స్టేటస్‌లను చూడవచ్చు. అలాగే, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు, సినిమా స్టార్స్ మొదలగు వారిని ఫాలో కావచ్చు.
దీనిలో ఫిల్టర్ అనే ఆప్షన్ కూడా ఉంది. దీని సహయంతో యూజర్లు ఎక్కువ ఆదరణ కలిగిన, ఎంచుకున్న కేటగిరీల వారిగా ఛానల్స్‌ను ఫాలో కావచ్చు. ఇండియాతో సహా 150 దేశాల్లోని వినియోగదారులకు వాట్సాప్ ఛానెల్‌లు అందుబాటులోకి వస్తున్నాయని మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ సర్వీస్ బుధవారం ప్రకటించింది. ఛానల్స్‌లో యూజర్ల భద్రత కోసం ఫోన్ నెంబర్ అవతలి వారికి కనిపించకుండా ఉంటుంది. ఈ ఫీచర్‌ను పొందడానికి వినియోగదారులు యాప్ స్టోర్ నుండి వాట్సాప్‌ను అప్‌డేట్ చేయాలి.
- Tags