స్పామ్ కాల్స్ కట్టడికి ట్రూకాలర్‌లో కొత్తగా AI ఫీచర్‌

by Harish |
స్పామ్ కాల్స్ కట్టడికి ట్రూకాలర్‌లో కొత్తగా AI ఫీచర్‌
X

దిశ, టెక్నాలజీ: ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇవి ఆగడం లేదు. దీంతో తాజాగా ప్రముఖ కాలర్‌ఐడీ సంస్థ ట్రూకాలర్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది స్పామ్ కాల్‌లను ఆటోమెటిక్‌గా బ్లాక్ చేస్తుంది. స్పామర్‌లు, వాటి సంబంధిత కాల్స్ నుంచి రక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫీచర్ Android ప్రీమియం సబ్‌స్క్రైబర్‌ల కోసం కొత్త "Max" అప్‌డేట్‌‌తో లభిస్తుంది. సాధారణ ట్రూకాలర్ వినియోగదారులకు అందుబాటులో లేదు. గతంలో ట్రూకాలర్ కాల్ రికార్డింగ్‌లు, AI- పవర్డ్ ట్రాన్స్‌క్రిప్షన్స్ ఫీచర్‌ను తీసుకొచ్చిన కంపెనీ ఒక నెల లోపే ఈ కొత్త ఫీచర్‌ను తెచ్చింది. ట్రూకాలర్ కాల్ యాప్ వెర్షన్ v13.58 లేదా తర్వాతి వెర్షన్‌ యూజర్లు ఈ సేవలను వాడుకోవచ్చు. యాప్‌లో సెట్టింగ్స్ ఆప్షన్‌లో ఈ ఫీచర్‌ను ఎనెబుల్ చేసుకోవచ్చు. Max ని ఎంచుకున్న తర్వాత , యాప్ స్పామర్‌ల నుండి కాల్‌లను ఆటోమెటిక్‌గా బ్లాక్ చేస్తుంది. అయితే ఇది iOS వినియోగదారులకు అందుబాటులో లేదు.

Advertisement

Next Story

Most Viewed