ఎట్టకేలకు కుమార్తె పేరు ప్రకటించిన స్టార్ కపుల్.. ఆ క్యూట్ నేమ్ మీనింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Kavitha |
ఎట్టకేలకు కుమార్తె పేరు ప్రకటించిన స్టార్ కపుల్.. ఆ క్యూట్ నేమ్ మీనింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898AD) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్న దీపికా.. గత నెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము త‌ల్లిదండ్రులు కాబోతున్నట్లు రణ్‌వీర్ సింగ్‌(Ranveer Singh), దీపికా పదుకొనే ప్రక‌టించారు. ఇక అప్పటి నుంచి ఆమె తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నది. అయితే ఈ భామ తనకు 7 వ నెల వచ్చేవరకు షూటింగ్ చేస్తూనే ఉంది. దీంతో కల్కి మూవీలో ఈ ప్రిన్సెస్ పుట్టకముందే సినిమాల్లో నటించేసింది అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.

ఇక ఈ చిన్నారి జననంతో ఆ ఇంట కొత్త వెలుగు పుట్టుకొచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ బుడ్డ దాని ముఖాన్ని మాత్రం అభిమానులకు ఈ జంట చూపించలేదు. స్టార్ సెలబ్రిటీలు కావడం.. అందులోనూ విమర్శలు, వివాదాలు ఉన్న జంట కావడంతో ఆ ప్రభావం పిల్లలపై పడకుండా చిన్నారి ముఖాన్ని చూపించడానికి దీపికా ఒప్పుకోలేదని, చిన్నారి రెండేళ్లు దాటే వరకు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు అని అనుకున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

ఇక తాజాగా పండగపూట.. దీపికా తన కూతురి మొదటి ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాకుండా ఈ దీవాళీ రోజున తమ కూతురు పేరును చెప్పుకొచ్చారు. తమ కుమార్తెకు ‘దువా పదుకొనే సింగ్’ అని నామకరణం చేసినట్లు దీపికా చెప్పుకొచ్చింది. ఇక దువా అంటే ప్రార్థన అని, తమ ప్రార్థనలకు ప్రతిరూపం ఆమె అని రాసుకొచ్చింది. ఇక ముఖాన్ని చూపించకుండా కేవలం చిన్నారి పాదాలను మాత్రమే చూపించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story