Attempted Rape, Murder: రాష్ట్రంలో మరో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య

by Shiva |
Attempted Rape, Murder: రాష్ట్రంలో మరో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చట్టపరంగా కఠిన శిక్షలు అమలు అవుతున్నా మహిళలు (Ladies), చిన్నారుల (Girl Childs)పై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా.. తిరుపతి జిల్లా (Tirupathi District) వలమాడపేట (Valamadapet) మండల పరిధిలోని ఏఎంపురం (MA Puram)లో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మూడున్నరేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశ చూపి సుశాంత్ (Sushanth) అనే యువకుడు తన వెంట తీసుకెళ్లాడు.

అనంతరం అత్యాచారయత్నానికి పాల్పడగా.. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో తాను ఎక్కడ దొరికిపోతానోనని భయపడిన సుశాంత్ క్షణికావేశంలో బాలికను చంపేశాడు. అనంతరం మృతదేహం ఎవరికీ దొరకకుండా పాతిపెట్టాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సుశాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Advertisement
Next Story

Most Viewed