- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:7 నెలల చిన్నారికి నోబెల్ వరల్డ్ రికార్డ్.. అభినందించిన ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, అనంతపురం: ఏడు నెలల వయసులోనే అద్భుత ప్రతిభ కనబరిచి నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి హన్వికను ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందించారు. రామగిరి మండలం కలికివాండ్లపల్లి గ్రామానికి చెందిన చిన్నారి హాన్విక మూడు వందల రకాల ఫొటోలను అలవోకగా గుర్తిస్తోంది. ఏదైనా పేరు చెబితే.. వెంటనే దాని ఆకారంలో ఉన్న కార్డును గుర్తిస్తోంది. దీనిని హన్విక కుటుంబ సభ్యులు వీడియో చిత్రీకరించి తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నోబెల్ వరల్డ్ రికార్డ్స్ వారికి పంపారు.
చిన్నారి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయి నోబెల్ వరల్డ్ రికార్డ్ జాబితాలో చేర్చారు. చిన్నారికి మెడల్ తోపాటు సర్టిఫికెట్ పంపారు. దీంతో హన్విక తల్లిదండ్రులు.. ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. రామగిరి మండల కేంద్రంలో జరుగుతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో హాన్విక తల్లిదండ్రులు కలవగా.. చిన్నారి ప్రతిభను తెలుసుకుని ఎమ్మెల్యే సునీత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులోనే ఇంత మేధస్సు కనబరుస్తున్న ఆ చిన్నారిని, అలాగే తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్ లో ఈ చిన్నారి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.