- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారి తప్పుతున్న బాల్యం.. చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న వైనం
దిశ,భిక్కనూరు : పుస్తకాల బ్యాగులు భుజంపై వేసుకుని స్కూల్ కి వెళ్లాల్సిన బాలురు... చెడు వ్యసనాలకు బానిసై గంజాయి మత్తులో తూగుతూ... సిగరెట్లు ఊదుతూ జులాయిగా తిరుగుతున్నారు. స్కూల్ కి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయలుదేరిన కొందరు బాలురు, బ్యాగులు స్కూల్ లో ఉంచి, అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ఆరు బయట అక్కడ ఇక్కడ తిరిగి, లంచ్ బ్రేక్ కు లో మొహం చూపించి సాయంత్రం వరకు పత్తా లేకుండా పోతున్నారు. బెల్ మోగే సమయానికి పాఠశాలకు చేరుకొని, బ్యాగులు పుస్తకాలు వెంటబెట్టుకొని ఇండ్లకు వెళ్లి బాగా చదువుకుని వచ్చినట్టు తల్లిదండ్రుల ఎదుట బిల్డప్ కూడా ఇస్తున్నారు.
తల్లిదండ్రులంటే భయం లేకపోయినప్పటికీ, కనీసం పాఠాలు చెప్పే మాస్టార్లంటే కూడా భయపడే పరిస్థితి వారిలో నెలకొంది. కేవలం సెల్ ఫోన్ లోని రీల్స్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లను ఓపెన్ చేస్తూ, వాటిలో వచ్చే మంచిని పక్కనపెట్టి, పనికిరాని వాటికి కనెక్ట్ అవుతూ, బాల్య దశలోనే వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు చిన్న వయస్సులోనే చెడు వ్యసనాలకు బానిసై దారి తప్పుతుంటే తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పిల్లలకు ఇటువంటి క్రిమినల్ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, నమ్మలేని నిజం ప్రత్యక్షంగా కనబడుతుంటే, ఎంత పని అయిపోయే అంటూ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
షాప్ షెట్టర్ తీసి సిగరెట్ల దొంగతనం..
గంజాయి మత్తుకు అలవాటు పడ్డ కొందరు బాలురు నాలుగు రోజుల క్రితం భిక్కనూరు మండల కేంద్రంలో తాళం వేసిన కిరాణా షాప్ లో కి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. యజమానికి కూడా అనుమానం రాకుండా వరుసగా మూడు రోజులు తాళం వేసిన ఉన్న షెట్టర్ ను అదే స్టైల్ లో పైకి లేపి సుమారు రూ. 10 వేల విలువ చేసే సిగరెట్లను దొంగిలించారు. ఈ విషయం తెలిసి షాపు యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. అదే స్టూడెంట్స్ గ్యాంగ్ లోని కొందరు ఏడు ఎనిమిది నెలల క్రితం పాఠశాలలో బ్యాగులు పెట్టేసి, రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేకపోయారు. దీంతో భయపడిపోయిన తల్లిదండ్రులు రాత్రి పదిన్నర గంటల వరకు వారి కోసం గాలించగా, భిక్కనూరు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కి నిజామాబాద్ వైపు వెళ్తుండగా, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి రైల్వే స్టేషన్ లో వారిని పట్టుకుని ఇంటికి పంపించేశారు.
తోటి విద్యార్థులతో ఈవ్ టీజింగ్...
స్నానం చేసి వచ్చిన తోటి విద్యార్థి టవల్ గుంజేసి... నగ్నంగా ఉంచి ఏడిపించారు. అంతటితో ఊరుకోకుండా నగ్నంగా డాన్స్ చేయాలంటూ వేధించారు. అవసరమైనప్పుడు పదో పరకో ఇవ్వాలంటూ టార్చర్ చేయడమే కాకుండా, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమి బయటకు చెప్పవద్దని బెదిరించేవారు. వారం రోజుల క్రితం భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సిక్స్త్ క్లాస్ విద్యార్థులు ఈవ్ టీజింగ్ చేయడం కలకలం రేపింది. తోటి విద్యార్థులు చేస్తున్న అరాచకాలు భరించలేక, నేను ఆ స్కూల్లో చదవలేనంటూ తల్లిదండ్రుల ముందు బోరున విలపించాడు. అంతకుముందు రెండు నెలల క్రితం ఐదో తరగతి విద్యార్థిని ర్యాగింగ్ చేసి ఏడిపించారు. దీంతోపాటుగా మత్తుకు బానిసలైన యువత చిన్నారులు బహిరంగంగానే చిన్న చిన్న విషయాలకే సినిమాను తలపించే విధంగా రోడ్లపై ఫైటింగులు చేస్తున్నారు. ఎవరైనా అడ్డం వెళ్తే వారిపై సైతం దాడులకు వెనుకాడడం లేదు.
వైట్నర్, బోనాఫిక్స్ సేవిస్తున్న చిన్నారులు..
మత్తుకు బానిసలైన చిన్నారులు జనరల్ గా దుకాణాలలో దొరికే వైట్నర్, బోనాఫిక్స్ లను ప్లాస్టిక్ చిన్న కవర్లు, కర్చీఫ్ లలో పోసుకొని దమ్ము కొడుతున్నారు. దుకాణాలలో ఈజీగా దొరికే వీటిని కొనుగోలు చేసి నిర్మానుష ప్రాంతాలకు వెళ్లి వాటిని సేవిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు చిన్నారులైతే బహిరంగంగానే వీటిని సేవిస్తూ మద్యం సేవించిన వారి వలె రోడ్లపై తూగుతున్నారు. ఎవరైనా వారిని ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు సమాధానం చెప్పడం తో పాటు మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అంటూ ఉల్టా దబాయిస్తున్నారు. కొందరు దుకాణదారులు వీటికి అలవాటు పడిన చిన్నారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
కల్తీ కల్లుకు అలవాటు పడుతున్న యూత్..
నిత్యం మత్తులో తూగే యువత లో చాలామంది మద్యం, గంజాయిని కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో గ్రామాల్లో తక్కువ ధరకు దొరికే కల్తీకల్లుకు ఈజీగా అలవాటు పడుతున్నారు. చాలామంది యూత్ తో పాటు,పాఠశాలకు వెళ్లే చిన్నారులు సైతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా కల్లు బట్టీలకు వెళ్లి కల్తీ కల్లును సేవిస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్న ఘటనలు కూడా రోజురోజుకు వెలుగు చూస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి చిన్నారులు, యువత మత్తుకు బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.