కరెంట్‌ బిల్లులతో ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్న సైబరాసురులు.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..!

by Prasanna |   ( Updated:2023-11-07 06:30:07.0  )
కరెంట్‌ బిల్లులతో ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్న సైబరాసురులు.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..!
X

దిశ,వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో స్కామర్లు రోజు రోజుకు పెరిగి పోతున్నారు. ఇప్పటి వరకూ ఏదో ఫోన్‌ కాల్‌ చేయడమే లేక.. ఏదో లింక్‌ పంపడమో, చోరీలకు పాల్పడే స్కామర్లు.. ఇప్పుడైతే ఏకంగా కరెంట్‌ బిల్లులతోనే మీ బ్యాంకు ఖాతా మొత్తాన్ని ఖాళీ చేసేస్తున్నారు. ఇలా ఎలా అవుతుందని ఆశ్చర్యపోతున్నారా?అదేంటో ఇక్కడ చూద్దాం..

విద్యుత్‌ శాఖతో రిజిస్టర్‌ అయి ఉన్న మీ సెల్‌ ఫోన్‌ కు ఓ మెసేజ్‌ ను స్కామర్లు పంపుతున్నారు. విద్యుత్‌ శాఖ నుంచి వచ్చిన మెసేజ్‌ వినియోగదారులను మభ్య పెట్టి.. మీరు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని, చెల్లించకపోతే మీ ఇంటికి విద్యుత్‌ ను నిలిపివేస్తామని.. లేదంటే భారీ ఫైన్‌ పడుతుందని బెదిరిస్తున్నారు. అయితే ఆ దోపిడీదారుల నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఈ టిప్స్‌ ని ఫాలో అవ్వమని నిపుణులు చెబుతున్నారు.

యూఆర్‌ఎల్‌లను తనిఖీ చేయండి: ఏదైనా ఆన్‌లైన్ చెల్లింపు చెల్లించే ముందు, వెబ్‌సైట్ యొక్క URL “https://”తో ప్రారంభమవుతుందని తెలుసుకోండి.

చెల్లింపు అభ్యర్థనలను ధ్రువీకరించండి : చెల్లింపు అభ్యర్థనలు పంపినవారి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. అత్యవసర చెల్లింపు డిమాండ్లు లేదా అనుమానాస్పద సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి.

యూపీఐ చెల్లింపు యాప్‌లు: మీరు మోసాన్ని అనుమానించినట్లయితే, ఫోన్‌ పే, గూగుల పే, పేటీఎం వంటి ఇతర యూపీఐ యాప్‌ లలో హెల్ప్‌ బటన్‌ను క్లిక్‌ చేసి ట్రాన్సాక్షన్స్‌పై క్లిక్‌ చేసి నివేదించండి.

Advertisement

Next Story