- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tecno Camon 30s: టెక్నో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఫీచర్లు ఏంటంటే..?
దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో(Tecno) తన కొత్త మిడ్ రేంజ్ మొబైల్(Mid Range Mobile)ను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో కెమన్ 30ఎస్(Camon 30s) స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ 8GB +256GB, 8GB + 128GB RAM, 6GB + 128GB స్టోరేజీ వేరియంట్స్ లలో లభిస్తుంది. 8GB +256GB వేరియంట్ ధర సుమారు రూ.18,200గా కంపెనీ నిర్ణయించింది. మిగతా రెండు వేరియంట్ల ధరలను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ కొత్త ఫోనులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డివైజ్ బ్లూ, నెబులా వయొలెట్, సెలెస్టియల్ బ్లాక్ అలాగే డాన్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది. అయితే ఈ కొత్త కెమన్ 30ఎస్ మొబైల్‌ను ఇండియా మార్కెట్లోకి ఎప్పడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
టెక్నో కెమన్ 30ఎస్(Tecno Camon 30s) ఫీచర్స్..
- 6.78-అంగుళాల AMOLED స్క్రీన్
- మీడియాటెక్ హీలియో జీ100(MediaTek Helio G100) చిప్సెట్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
- 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్
- 50-మెగాపిక్సెల్ తో కూడిన బ్యాక్ కెమెరా, అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
- 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.