Tech News: ఆ ఫోన్లలో ఇక వాట్సప్ సేవలు బంద్.. జాబితాను విడుదల చేసిన కెనాల్‌టెక్‌

by Shiva |
Tech News: ఆ ఫోన్లలో ఇక వాట్సప్ సేవలు బంద్.. జాబితాను విడుదల చేసిన కెనాల్‌టెక్‌
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో కొత్త కొత్త మార్పులతో కొన్ని స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ సేవలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రస్తుతం ఉన్న మనుగడలో ఉన్న 34 మొబైల్ మొబైల్స్‌లో వాట్సాప్ తమ సేవలను ఆపివేయనున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన జాబితాను కెనాల్‌టెక్‌ బుధవారం విడుదల చేసింది. శాంసంగ్‌ కంపెనీలో మోడల్స్‌లో గెలాక్సీ ఏస్ ప్లస్‌, గెలాక్సీ కోర్‌, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌-2, గెలాక్సీ గ్రాండ్‌, గెలాక్సీ నోట్‌ 3, గెలాక్సీ ఎస్‌3 మినీ, గెలాక్సీ ఎస్‌4 యాక్టివ్‌, గెలాక్సీ ఎస్‌4 మినీ, గెలాక్సీ ఎస్‌4 జూమ్‌ మొబైళ్లలో వాట్సాప్ సేవల్ బంద్ అవ్వనున్నాయి.

అదేవిధంగా మెటోరోలా కంపెనీలో మోటో జీ, మోటో ఎక్స్‌, యాపిల్‌ కంపెనీలో ఐఫోన్‌-5, ఐఫోన్‌-6, ఐఫోన్‌ 6S, ఐఫోన్‌ 6S ప్లస్‌, ఐఫోన్‌ SE, హువావే కంపెనీలో అసెండ్ P6 S, అసెండ్ G525, హువావే సీ199, హువావే జీఎక్స్‌1ఎస్‌, హువావే వై625,లెనోవో కంపెనీలో లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్‌890, సోనీ కంపెనీలో ఎక్స్‌పీరియా Z1, ఎక్స్‌పీరియా E3, ఎల్‌జీ కంపెనీలో ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఆప్టిమస్‌ జీ, ఆప్టిమస్‌ జీ ప్రో, ఆప్టిమస్‌ ఎల్‌7 మోడళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed