Realme C30s launched in India: Check specs and price

by Harish |   ( Updated:2022-09-14 11:09:16.0  )
Realme C30s launched in India: Check specs and price
X

దిశ, వెబ్‌డెస్క్: Realme కంపెనీ భారత్‌లో కొత్తగా స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ పేరు 'Realme C30s'. ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్. రెండు స్టోరేజ్‌లలో ఫోన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. 2GB RAM + 32GB స్టోరేజ్ ధర రూ.7,499. 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 8,999. ఇది స్ట్రైప్ బ్లాక్, స్ట్రైప్ బ్లూ కలర్స్‌లలో లభిస్తుంది. వెనుక కెమెరా సెటప్ పూర్తి-HD వీడియోలను 30fps వద్ద రికార్డు చేయగలదు.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22 న ఉదయం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మిగిలిన కస్టమర్‌లు సెప్టెంబర్ 23 ఉదయం 12 గంటలకు Flipkart, Realme India ఆన్‌లైన్ స్టోర్ నుండి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


Realme C30s స్పెసిఫికేషన్స్..

* 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌, 60Hz రిఫ్రెష్ రేట్.

* ఆక్టా-కోర్ Unisoc SC9863A SoC ద్వారా పనిచేస్తుంది.

* Realm UI Go ఎడిషన్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12 ద్వారా రన్ అవుతుంది.

* మెమరీని మైక్రో SD కార్డ్ 1TB వరకు పెంచుకోవచ్చు.

* ఫోన్ బ్యాక్ సైడ్ 8-మెగాపిక్సెల్ AI ప్రధాన కెమెరా.

* ముందు వైపు సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

* సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది.

* 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.




Advertisement

Next Story

Most Viewed