కనుమరుగు కానున్న మైక్రోసాఫ్ట్ వర్డ్‌ప్యాడ్..

by Shiva |   ( Updated:2023-09-04 13:51:57.0  )
కనుమరుగు కానున్న మైక్రోసాఫ్ట్ వర్డ్‌ప్యాడ్..
X

దిశ, వెబ్ డెస్క్ : నూతన సర్వీసులను అప్ డేట్ చేస్తున్న కారణంగా ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 30 ఏళ్ల క్రితం ప్రవేశ పెట్టిన వర్డ్ ప్యాడ్ కనుమరుగు కానుంది. ఇప్పటికీ చాలా మంది యూజర్లు వర్డ్ ప్యాడ్ ను వినియోగిస్తున్నారు. నూతన సంవత్సరంలో విడుదల కాబోతున్న నెక్స్ట్ విండోస్ ఓ.ఎస్ అప్‌డేట్ నుంచి కూడా దీనిని పూర్తిగా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇక ఆఫీస్ 365 సబ్‌స్క్రిప్షన్‌లో ఒక భాగం కానుంది. నోట్‌ప్యాడ్‌ ఒక ఫ్రీ సర్వీస్ మాత్రమే, యూజర్లు మెరుగైన ఫీచర్లు, .doc, .rtf వంటి వివిధ ఫార్మాట్లలో డాక్యుమెంట్ల ఎడిటింగ్ లకు మైక్రోసాఫ్ట్ వర్డ్‌కు మారాలని కోరారు. కంపెనీ లాభాలను వృద్ధి చేసేందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ వర్డ్‌ప్యాడ్‌కు ముగింపు పలికినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed