- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత మార్కెట్లోకి అధునాతన Microsoft ల్యాప్‌ట్యాప్‌లు
దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియాలో కొత్తగా ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వీటి పేరు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 9, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 5. ఈ రెండు మోడళ్లు గత నెలలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు భారత్‌లోకి అడుగుపెట్టాయి. ల్యాప్‌టాప్‌లు నవంబర్ 29 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
Microsoft Surface Pro 9:
ఇది 13-అంగుళాల పిక్సెల్‌సెన్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇంటెల్ కోర్ 12వ Gen i5 ప్రాసెసర్‌తో లభిస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 1,11,899. 32GB RAM,1TB స్టోరేజ్, ఇంటెల్ కోర్ 12వ Gen i7 ప్రాసెసర్ ధర రూ. 2,69,999. సర్ఫేస్ ప్రో 9 ల్యాప్‌టాప్ కొనుగోలుపై రూ. 14,999 విలువైన సర్ఫేస్ ప్రో కీబోర్డ్‌ను కంపెనీ అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లో HD కెమెరా, ఓమ్నిసోనిక్ స్పీకర్లు, సరికొత్త టచ్ టెక్నాలజీకి సపోర్ట్‌గా G6 చిప్ ఉంది.
Microsoft Surface Laptop 5:
ఇది 13.5-అంగుళాల లేదా 15-అంగుళాల పిక్సెల్‌సెన్స్ డిస్‌ప్లేతో వస్తుంది. రెండు డిస్‌ప్లేలకు డాల్బీ విజన్ ఐక్యూ సపోర్ట్ ఉంది. Windows Helloతో ఫాస్ట్ లాగిన్‌తో వస్తుంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16GB RAM, 512GB స్టోరేజ్ ధర రూ. 1,78,999. ఇది ఇంటెల్ కోర్ i7 12వ తరం ప్రాసెసర్ 15-అంగుళాల డిస్ప్లే వేరియంట్‌లలో కూడా వస్తుంది. దీని బేస్ వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ. 1,39,999. ల్యాప్‌టాప్ 5 కొనుగోలుపై రూ. 7,499 విలువైన సర్ఫేస్ పాపీ రెడ్ ఆర్క్ మౌస్ లభిస్తుంది.
- Tags
- Microsoft