- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Meta-AP Govt: మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. ఇక నుంచి వాట్సప్‌లోనే అన్ని సర్టిఫికెట్లు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Govt) ప్రజలకు వాట్సప్(WhatsApp) ద్వారా పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, విద్యా శాఖ మినిస్టర్ నారా లోకేష్(IT&Education Minister Nara Lokesh) సమక్షంలో ప్రభుత్వ అధికారులు, మెటా సంస్థ ప్రతినిధులు దిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో కాస్ట్ సర్టిఫికెట్ సహా కరెంట్, వాటర్, హౌస్ ట్యాక్స్, ఇతర బిల్లులు ఇకపై వాట్సప్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే నకిలీ, ట్యాపరింగ్ అవకాశం కాలేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లను వాట్సప్ జారీ చేయనుంది. టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి మెటా అందించనుంది.
ఈ విషయాన్ని నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికైన 'ఎక్స్(X)'లో తెలిపారు. మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. త్వరలోనే మెటా టెక్నాలజీ ద్వారా పౌర సేవలను ప్రజలకు ఒక్క క్లిక్ ద్వారా సమర్ధవంతంగా అందజేస్తామని ట్వీట్ చేశారు. కాాగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, యువత ఈ సమస్యను నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. సకాలంలో సర్టిఫికేట్లు అందక ఇబ్బందులు పడుతున్నామని.. టెక్నాలజీ సాయంతో అన్ని పనులూ ఇంటివద్దకే అందుతున్నప్పుడు.. పౌరసేవలను కూడా ఇలాగే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే మొబైల్‌లోనే ఆయా సర్టిఫికెట్లు అందిస్తామని నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.