వినూత్న ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌లు, అల్ట్రా పీసీని విడుదల చేసిన LG

by Harish |   ( Updated:2023-06-15 11:38:50.0  )
వినూత్న ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌లు, అల్ట్రా పీసీని విడుదల చేసిన LG
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ కంపెనీ భారత్‌లో వినూత్న ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌లను, అల్ట్రా పీసీని విడుదల చేసింది. ఈ సిరీస్ పేరు ‘LG Gram series(గ్రామ్ సిరీస్), LG UltraPC(అల్ట్రాపిసి)’. భారత మార్కెట్లో ల్యాప్‌టాప్‌లు, పీసీలకు భారీగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ అవసరాలను తీర్చడానికి లేటెస్ట్ ఫీచర్స్‌తో వీటిని తీసుకొచ్చినట్లు LG ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ హక్ హ్యూన్ కిమ్ ఒక ప్రకటనలో తెలిపారు. LG Gram seriesలో LG గ్రామ్, LG గ్రామ్ స్టైల్ , LG గ్రామ్ 2-ఇన్-1, LG Ultra PC ఉన్నాయి.


LG గ్రామ్ 14 అంగుళాల ధర రూ. 1,43,000. 16 అంగుళాల ధర రూ. 1,77,000. 17 అంగుళాల ధర రూ. 1,83,000. LG గ్రామ్ స్టైల్ 14-అంగుళాల స్క్రీన్ రూ. 191,000. LG గ్రామ్ 2-in-1 16-అంగుళాల ధర రూ. 2,05,000. LG Ultra PC మోడల్ రూ. 1,17,000.


LG గ్రామ్ సిరీస్ 14-అంగుళాల వెర్షన్‌లో ఇంటెల్ EVO సర్టిఫైడ్ 13వ జెన్ కోర్ ప్రాసెసర్‌ వస్తుంది. 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో యాంటీ-గ్లేర్ IPS డిస్ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది. LG గ్రామ్ స్టైల్ సిరీస్ 14-అంగుళాల వెర్షన్‌లో అందించబడింది. Intel 13th Gen, Gen 4 NVMe సాలిడ్-స్టేట్ డ్రైవ్ (SSD)ని కలిగి ఉంది. చివరగా LG అల్ట్రా పీసి హై-రిజల్యూషన్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది AMD Ryzen 7000 సిరీస్ ప్రాసెసర్‌‌తో వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed