- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెక్ట్స్ ఆధారంగా ఇమేజ్ క్రియేటింగ్.. గూగుల్ కొత్త ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ గూగుల్ ఇటీవల కొత్త కొత్త ఫీచర్లను వరుసగా విడుదల చేస్తుంది. తాజాగా AI- పవర్డ్ ఇమేజ్ జనరేటర్ ఫీచర్‌ను తీసుకొస్తుంది.యూజర్లు టెక్ట్స్ ఆధారంగా ఇమేజ్‌లను రూపొందించే సెర్చ్ జనరేటివ్ ఎక్స్‌పీరియన్స్ (SGE) ని పరిచయం చేసింది. యూజర్లు చెప్పిన విధంగా వారి ఆలోచనల ప్రకారం, AI- పవర్డ్ ఇమేజ్ ఫీచర్ ఇమేజ్‌లను తయారుచేస్తుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని Google సెర్చ్ ల్యాబ్స్ ప్రోగ్రామ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ సెర్చ్‌లో ల్యాబ్స్ ఐకాన్‌పై క్లిక్ చేసి మీ ఐడియాల ప్రకారం, ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఇమేజ్‌కు అనుబంధంగా, దీనికి సరిపోలే వాటిని కూడా ప్రక్కన చూడవచ్చు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇంకా ఇండియాలోకి రాలేదు. సెర్చింగ్ అనుభవాన్ని మరింత ఆధునికరించడానికి ఈ ఫీచర్‌ను త్వరలో ఇండియాలోకి తీసుకురానున్నారు.
- Tags