వారెవ్వా.. గౌడన్న ఆలోచన భలా..!! (వీడియో)

by Nagaya |
వారెవ్వా.. గౌడన్న ఆలోచన భలా..!! (వీడియో)
X

దిశ, సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం ముమ్మిడివరం గ్రామానికి చెందిన బోనగిరి రవి 15 సంవత్సరాలుగా తాటికల్లు తీసి జీవనం సాగిస్తున్నారు. 57 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో తాటి చెట్టు ఎక్కలేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో చెట్టు ఎక్కడానికి సులభమైయ్య పద్ధతులను అన్వేషించారు. గతంలో వ్యవసాయ బావులు తవ్వడానికి ఉపయోగించే క్రేన్‌లను నడిపిన అనుభవంతో తాడిచెట్టు పై ఒక ఇనుప కమ్మిని అమర్చి దానికి రెండు గిరకలు బిగించారు. తనకు సమానమైన బరువును ఒక సంచిలో వేసి ఒక గిరక తాటి చెట్టు పైకి వచ్చేలా ఒక గిరక కిందకు వచ్చేలా తాడు కట్టారు. తాడు రెండు వైపున తాను కూర్చున్న అందుకు ఒక కూర్చుని కట్టి అందులో కూర్చుంటారు. తాడు వదలగానే బరువు కిందకు దిగుతుంది.. కుర్చీ పైకి వెళ్తుంది. దిగే సమయంలో తాడు పట్టుకుని దిగుతుండగా బరువు పైకి వెళ్తుంది. ఇలా ఎటువంటి శారీరక శ్రమ లేకుండా సులభంగా చెట్టు పైకి వెళ్లి కల్లు తీసుకొని వస్తున్నారు. దీనికి ఖర్చు అయ్యే రూ.4 వేలు అయినట్టు రవి తెలిపారు. రవి నూతన ఆవిష్కరణను చూసి కల్లు కోసం వచ్చేవారు ఆశ్చర్యానికి గురవుతూ అభినందిస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed