బ్యాటరీ సమస్యలకు కొత్త పరిష్కారాన్ని అందిస్తున్న గూగుల్

by Harish |
బ్యాటరీ సమస్యలకు కొత్త పరిష్కారాన్ని అందిస్తున్న గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త ఫీచర్ రానుంది. తన రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ఆండ్రాయిడ్ 14లో ఒక కీలక అప్‌డేట్‌ను అందించనుంది. ఇటీవల నివేదిక ప్రకారం, ఆండ్రాయిడ్ 14లో బ్యాటరీ హెల్త్‌కు సంబంధించిన కొత్త ఆప్షన్‌లను ఇవ్వాలని కంపెనీ చూస్తున్నట్లు సమాచారం. పాత వెర్షన్‌లలో బ్యాటరీ ట్రాకింగ్ చేయడానికి ఎలాంటి ఫీచర్స్ లేవు. ప్రస్తుత కాలంలో వినియోగదారులు ఎక్కువగా బ్యాటరీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త వెర్షన్‌లో BatteryManager API ఇవ్వడం ద్వారా ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ ఉంటుందని, అలాగే బ్యాటరీ సమస్యలను పరిష్కరించవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.



ఈ ఫీచర్ యాపిల్ ఫోన్లలో ఉన్నప్పటికి ఆండ్రాయిడ్ డివైజ్‌లలతో మాత్రం లేదు. ఇప్పుడు గూగుల్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి Android 14 Beta 2 లేదా ఆ తర్వాత వెర్షన్‌లో నడుస్తున్న Pixel స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని నివేదిక పేర్కొంది. రాబోయే కొత్త అప్‌డేట్ బ్యాటరీ స్టేటస్‌తో పాటు, మాల్వేర్‌ను నియంత్రించడానికి కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో వస్తుంది.

Advertisement

Next Story