OnePlus: వన్ ప్లస్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

by Prasanna |   ( Updated:2024-01-10 05:43:35.0  )
OnePlus: వన్ ప్లస్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌
X

దిశ,ఫీచర్స్: ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా.. ఉంటే అది ఏ బ్రాండ్ అనేది మాత్రమే చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో వినియోగదారులు బ్రాండెడ్ ఫోన్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాటిలో వన్ ప్లస్ ఫోన్ కూడా ఒకటి . ఎందుకంటే ఆ ఫోన్ క్వాలిటీతో పాటు ఫీచర్లు కూడా కొత్తగా ఉంటాయి. ఇతర ఫోన్స్‌తో పోల్చుకుంటే ఈ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా నార్డ్‌ 3 స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేస్తూ గొప్ప శుభ వార్త చెప్పింది. ఇంతక ముందు ఎన్నడూ లేని విధంగా వినియోగదారులకు భారీ డిస్కౌంట్‌ ఇస్తుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

8GB ర్యామ్‌ 128 GB స్టోరేజ్‌ ఒకటి కాగా, 12 GB ర్యామ్‌ 256 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసారు. ఇక డిస్కౌంట్‌ విషయానికొస్తే.. 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ ధర రూ.33,999 కాగా డిస్కౌంట్‌లో రూ.29,999 కి సొంతం చేసుకోవచ్చు. ఇక 12 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్ ధర రూ. 37,999 కాగా డిస్కౌంట్‌లో రూ. 33,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఫోన్ ఫీచర్స్‌ విషయానికొస్తే.. 5G , 4G ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

Advertisement

Next Story