- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికలపై ప్రభావం చూపనున్న డీప్‌ఫేక్‌లు
దిశ, టెక్నాలజీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాని వలన నష్టాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్‌ల వ్యవహరం అందరిని భయపెడుతుంది. ముఖాన్ని, వాయిస్‌ను మార్ఫింగ్ చేస్తూ, AI ని తప్పుడు దారికి ఉపయోగిస్తున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ ఏడాది భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్‌లు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు, రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్యానికి గణనీయమైన ముప్పుగా ఉన్నాయి. తప్పుడు సమాచారాన్ని సృష్టించడానికి, దానిని వ్యాప్తి చేయడానికి ఒక ఆయుధంగా ఉంటాయని చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అధికారి హరీష్ కుమార్ అన్నారు. వ్యక్తులను, రాజకీయ నాయకులను అప్రతిష్టపాలు చేయడానికి, వారి మాటలను ఎన్నికల సమయంలో వక్రీకరించడానికి డీప్‌ఫేక్‌లు పెద్ద ముప్పులా తయారయ్యాయని ఆయన తెలిపారు.
2017 చివరిలో ఆన్‌లైన్‌లో 7,900 డీప్‌ఫేక్ వీడియోలు ఉండగా, అది 2019 ప్రారంభంలో రెండింతలు పెరిగి 14,678కి చేరుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని తెలుస్తుంది. ఇటీవల, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జో బైడెన్‌ల డీప్‌ఫేక్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు, డీప్‌ఫేక్ బెదిరింపులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.