ట్విట్టర్ యూజర్లకు ఎలన్ మస్క్ శుభవార్త.. డబ్బులు సంపాదించునే అవకాశం!

by GSrikanth |
ట్విట్టర్ యూజర్లకు ఎలన్ మస్క్ శుభవార్త.. డబ్బులు సంపాదించునే అవకాశం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేలా అనుమతి ఇస్తున్నట్లు తాజాగా మస్క్ ప్రకటించారు. ఇందులో కోసం సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకు వస్తున్నామని వెల్లడించారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకుని యూజర్లు ఆదాయం ఆర్జించుకోవచ్చని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.

సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అమెరికాలోనే అందుబాటులో ఉండగా త్వరలో ఇతర దేశాలకు విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. తమ కంటెంట్ ద్వారా యూజర్లు పొందిన డబ్బు నుంచి వచ్చే 12 నెలల పాటు ట్విట్టర్ ఏమీ తీసుకోబోమని, సబ్ స్క్రిప్షన్ ద్వారా వచ్చిన ఆదాయంలో గరిష్టంగా 70 శాతం వరకు యూజర్లకే ఇచ్చేస్తామని వెల్లడించారు. ఈ మార్పుల ద్వారా మరింత ఎక్కువ మంది క్రియేటర్ల నుంచి ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ మీదకు తీసుకు వచ్చేందుకు మస్క్ యత్నిస్తున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story