అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తాం

by Naveena |
అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తాం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ మొదటి స్థానంలో నిలిపేలా అందరం కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాచెర్ల రామకృష్ణ గౌడ్ తన కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛంతో కలిసి పరిచయం చేస్తూ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..వివిధ హోదాలోని గెజిటెడ్ అధికారులు ఆయా రంగాల్లోని సమస్యలపట్ల స్పందిస్తూ,తమ పరిధిలో పరిష్కరించాలని,అవసరమనుకుంటే తన దృష్టికి తీసుకరావచ్చని,అందరం కలిసి కట్టుగా శ్రమిస్తే రానున్న నాలుగు సంవత్సరాలలో అన్నింటిలో మన జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్,ఉపాధ్యక్షురాలు కె.సంధ్య,కార్యదర్శి వరప్రసాద్,అదనపు కార్యదర్శి జాకీర్,జగన్ మోహన్,రవీందర్,మురళీధర్,శ్రీను గౌడ్,నాగరాజు,చంద్రకళ, గంగాధర్,బక్క శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed