విజయనగరం జిల్లాలో మళ్లీ ప్రబలిన డయేరియా.. 7 కేసులు నమోదు

by srinivas |
విజయనగరం జిల్లాలో మళ్లీ ప్రబలిన డయేరియా.. 7 కేసులు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా గుర్ల మండలం(Gurla Mandalam)లో మళ్లీ డయేరియా(Diarrhea) ప్రబలింది. జమ్ముగ్రామంలోనే 7 డయేరియా కేసులు నమోదు అయ్యాయి. దీంతో వారిని చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రి(Chipurupally Government Hospital)కి తరలించారు. డయేరియా వార్డులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

అయితే అక్టోబర్ నెలలోనూ గుర్ల మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా ప్రబలింది. దీంతో పలువురు మృతి చెందగా కొన్ని కేసులు నమోదు అయ్యాయి. వాంతులు, విరేచనాలతో జనాలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కూడా పలువురు మృతి చెందారు. మొత్తం 8 మంది చనిపోగా 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

దీంతో గుర్ల మండలంలో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రభుత్వం పత్యేక దృష్టి పెట్టింది. గ్రామానికి వచ్చే నీళ్లను పరీక్షించారు. నీటి కాలుష్యమే వ్యాధి ప్రబలడానికి కారణమని గుర్తించారు. గ్రామంలో తాగునీటి సరఫరా విధానం, పైపు లైన్ల లీకేజా, చెత్తా చెదారం ఉంటే చోట పైపు లైన్లు ఉండటం, తదితర వాటిపై పరిశీలన చేశారు. అనంతరం పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ అంశం రాజకీయంగా దుమారం రేగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే డయేరియా ప్రబలిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య కొన్ని రోజులు మాటల యుద్ధం నడిచింది. డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. గుర్ల మండలంలోని గ్రామాలను సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు సందర్శించారు. బాధిత కుటుంబాలకు ధైరయం చెప్పారు. దీంతో రెండు పార్టీల నాయకులు మధ్య మాటల యుద్ధాన్నికి తెరపడింది.

అయితే మళ్లీ ఇన్ని రోజులకు గుర్ల మండలంలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య అధికారులు వెంటనే స్పందించాలని, గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed