- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
దిశ, చిన్నచింతకుంట : క్రిస్మస్ సందర్భంగా మండలంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలో నెల్లికొండి,ఉంద్యాల చర్చిల్లో జరిగిన వేడుకల్లో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక మంది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా సంతోషంగా చేసుకోవాలని కోరారు. అందరి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, అరవింద్ రెడ్డి, వట్టెం శివ, నెల్సన్, శేఖర్, ప్రతాప్ శామ్సంగ్, జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.