Laptop: AI ఫీచర్లతో Asus కొత్త ల్యాప్‌‌టాప్‌లు

by Harish |   ( Updated:2024-09-19 15:01:42.0  )
Laptop: AI ఫీచర్లతో Asus కొత్త ల్యాప్‌‌టాప్‌లు
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ కంపెనీ Asus కొత్తగా ల్యాప్‌టాప్‌‌లను లాంచ్ చేసింది. వీటి పేరు ‘ExpertBook P5405’, ‘Asus Zenbook S14 2024’. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లతో వచ్చాయి. ముఖ్యంగా P5405 మోడల్ వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. Copilot ను కలిగి ఉంది. కృత్రిమ మేధస్సు పనుల కోసం మెరుగైన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)తో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌ (సిరీస్ 2)ను దీనిలో అమర్చారు. ధర గురించి కంపెనీ ఇంకా ప్రకటించలేదు. S14 2024 మోడల్ కూడా ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో అదే ఇంటెల్ కోర్ అల్ట్రా 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

ExpertBook P5405 మోడల్ ధర వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది నాల్గవ త్రైమాసికంలో ల్యాప్‌టాప్ దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. AI ట్రాన్స్‌క్రిప్ట్, AI ట్రాన్స్‌‌లెట్, AI ఉపశీర్షికలు, AI కెమెరా, AI నాయిస్ క్యాన్సలింగ్, వ్యాపార వాటర్‌మార్క్‌లు వంటి అధునాతన ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి.

మరో మోడల్ S14 2024 ధర రూ. 1.49 లక్షలు. దీనిని కంపెనీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, Asus eShop, Amazon, Flipkart ద్వారా సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 24 మధ్య ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కస్టమర్లు రూ.17,389 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే, ఉచిత ప్రీమియం ఇయర్‌బడ్‌లు కూడా లభిస్తాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో 72Wh బ్యాటరీని అందించారు.

Advertisement

Next Story