Airtel: స్మార్ట్‌వాచ్‌ నుంచే డైరెక్ట్ పేమెంట్.. ఎయిర్‌టెల్ సంచలన ఆవిష్కరణ

by Harish |   ( Updated:2024-08-28 15:33:53.0  )
Airtel: స్మార్ట్‌వాచ్‌ నుంచే డైరెక్ట్ పేమెంట్.. ఎయిర్‌టెల్ సంచలన ఆవిష్కరణ
X

దిశ, టెక్నాలజీ: స్మార్ట్‌వాచ్ నుంచే నేరుగా చెల్లింపులు చేయడానికి అనువుగా ఉండే సదుపాయాన్ని ఎయిర్‌టెల్ తీసుకొస్తుంది. తాజాగా బుధవారం గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌‌వాచ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ ప్రముఖ స్మార్ట్‌‌వాచ్ కంపెనీ నాయిస్‌తో కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీకి మద్దతు ఇచ్చే స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. ఇది త్వరలో అందుబాటులోకి వస్తుంది.


ఈ స్మార్ట్‌వాచ్‌లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ రూపే చిప్‌ను అమర్చారు. దీంతో చెల్లింపులు చేసే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా చేతికి ధరించిన వాచ్ నుంచే డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ మానిటరింగ్, ఇతర ఆప్షన్లతో పాటు చెల్లింపులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. స్మార్ట్‌వాచ్ ద్వారా మెట్రో, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు, మరెన్నో చోట్ల ఈజీగా చెల్లింపులు చేయవచ్చు. పిన్ నమోదు చేయకుండా రూ.5,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది.

స్మార్ట్‌వాచ్ నుండి కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ఆన్/ఆఫ్ చేసే సదుపాయాన్ని కూడా దీనిలో అందించారు. కొత్త ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, రక్తపోటు చెకింగ్ వంటి ఆరోగ్యం, ఫిట్‌నెస్ పర్యవేక్షణ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌ల ఎంపికలు దీనిలో ఉన్నాయి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ త్వరలో ఆన్‌లైన్‌లో, రిటైల్ షాపులలో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed