వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వారికి ఇది సమస్యేనా?

by Jakkula Samataha |
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వారికి ఇది సమస్యేనా?
X

దిశ, ఫీచర్స్ : అత్యంత ప్రజాధరణ పొందిన యాప్స్‌లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఒకటి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యాప్ వాడుతుంటారు. ఇక వాట్సాప్ తన వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌తో పలకరిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ యాప్ సరికొత్త ఫీచర్‌తో తన యూజర్స్ ముందుకు వస్తోంది. Wabitinfo నివేదిక ప్రకారం, కంపెనీ యూపీఐ ద్వారా చెల్లింపులను సులభతరం చేసే కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

ప్రస్తుతం చాలా మంది యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ వాడుతున్నారు. కానీ వాటితో ఎలాంటి పని లేకుండా చాలా సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడానికి వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా Wabitinfo సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. అందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఓ చిహ్నం కనిపిస్తోంది. అంటే ఎలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా దాని ద్వారా ఈజీగా చెల్లింపులు చేయవచ్చునంట. క్యూఆర్‌ కోడ్ స్కానర్ సొంత మార్గాన్నిWhatsApp Android బీటా వెర్షన్ 2.24.7.3లో కనుగొనవచ్చు.

ప్రస్తుతం ఎంచుకున్న వినియోగదారులు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. కెమెరా, సెర్చ్ ఐకాన్‌తో పాటు, ప్రధాన చాట్ ఇంటర్‌ఫేస్‌లో క్యూఆర్‌ కోడ్ స్కానర్ ఎంపిక అందుబాటులో ఉంటుంది. దీంతో యూపీఐ అకౌంట్‌లోకి వెళ్లకుండా సులభంగా చెల్లింపులు చేసుకొవచ్చు. ఇక ఈ వాట్సాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ అనేవి పెరిగితే, ఫోన్ పే, గూగుల్ పే వాటికి ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed