chat GPT : Chat Gpt బ్రేకప్ నోట్.. ఒక్కసారి చదివారంటే దిమ్మతిరగాల్సిందే..

by Sumithra |   ( Updated:2024-08-29 07:21:35.0  )
chat GPT : Chat Gpt బ్రేకప్ నోట్.. ఒక్కసారి చదివారంటే దిమ్మతిరగాల్సిందే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : క్రమక్రమంగా సాంకేతికత ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తోంది. ఇది మన జీవితాల్లో ఎంతగా నాటుకుపోయిందంటే అది లేకుండా చిన్న పనిని కూడా మనం ఊహించుకోలేకపోతున్నాం. యంత్రాలతో పాటు, సాఫ్ట్‌వేర్ కూడా మన ఆలోచన, అవగాహన భారాన్ని తగ్గిస్తుంది. చాట్ Gpt వచ్చిన తర్వాత ప్రజలు తమ ప్రేమ లేఖలను కూడా దాని ద్వారానే రాసేస్తున్నారు.

ఇక ప్రేమికులు విడిపోయేటప్పుడు లేఖలు, సందేశాలలో చాలా రాస్తారు. ఇప్పుడు దానికి కూడా చాట్ Gpt వాడి 'హై టెక్ బ్రేకప్' నోట్‌ను పంపిస్తున్నారు. దీన్ని ఒక్కసారి చదివారంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

ఒక వ్యక్తి చాట్ Gptని బ్రేకప్ లెటర్ రాయమని అడిగారు. దీంతో చాట్ జీపీటీ ఏం రాసిందో ఇప్పుడు చూద్దాం.. 'మీలాంటి వ్యక్తితో నేను ఎలా సంబంధం పెట్టుకున్నాను అని నేను ఆశ్చర్యపోతున్నాను ? నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. 40 ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా చిన్న పిల్లవాడు అనుకుంటున్నారా. మీరు ఈ వయస్సులో మిమ్మల్ని మీరు యువకుడిగా భావించుకుని ఇప్పటికీ స్కేట్‌బోర్డింగ్ చేస్తున్నారా. 'ఇప్పుడు నేను ఇక పై మీతో ఉండి నన్ను నేను దిగజార్చుకోను. నేను ఇప్పటికే మీ కంటే మంచి వారిని మరొకరిని ఎంచుకున్నాను అని రాసింది. అంతే కాదండోయ్ ఇంకా చాలా విషయాలను నోట్ లో పేర్కొంది. ఇక ఈ పోస్ట్‌ను చదివిన వాల్లంతా వాల్లకి నచ్చిన కామెంట్లను రాస్తున్నారు.

Advertisement

Next Story