- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువ క్రికెటర్‌కు హర్భజన్ వార్నింగ్..
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లలో సంజూ శాంసన్ ఒకరు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన శాంసన్ మెరుగైన ప్రదర్శన కనబర్చారు. దీంతో ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో శాంసన్‌కు చోటు దక్కింది. అయితే శాంసన్‌కు చోటు దక్కనా.. అతను నిరూపించుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన శామ్సన్ 48 పరుగులు మాత్రమే చేశాడు. అసలే శాంసన్‌కు వచ్చే అవకాశాలే తక్కువ, అందులో వాటిని సద్వినియోగం చేసుకోవడంలో సంజూ విఫలం అవుతూ ఉన్నాడు. దీంతో ఆయనకు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ చురకలంటిచాడు.
టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టం.. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకో అని సూచించాడు. అంతేగాకుండా శామ్సన్‌లో విశేషమైన టాలెంట్ ఉందంటూనే, వెంటనే ఆటలో మెరుగుపడకపోతే కష్టం అని అన్నారు. తప్పిదాల నుంచి మాత్రం శాంసన్ కోలుకొని, గాడిలో పడకపోతే అతని టాలెంట్ వృథా అవుతుందన్నాడు. అంతేగాకుండా టీమిండియాలో ప్లేస్ కూడా పోతుందనే విషయం గ్రహించాలన్నాడు. ఎందుకు విఫలం అయ్యాననే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించాలన్నాడు.a